ఫిబ్రవరి 16న పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, ఫిబ్రవరి 15: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు మాఘపౌర్ణమి కావడం విశేషం. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.