23రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు 30 శాతం అధిక నిధుల కేటాయింపు: ఎంపీ బండి సంజయ్ హర్షం

  • ప్రధాని, రైల్వే మంత్రులకు ధన్యవాదాలు
  • రైల్వే బడ్జెట్ సందర్భంగా మరిన్ని నిధుల రాబట్టేందుకు క్రుషి చేస్తామని వెల్లడి
  • తెలంగాణ అభివ్రుద్ధికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్న సంజయ్

న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ లో గత ఏడాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాలకు 30 శాతం అధికంగా నిధులు కేటాయించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ లో మొత్తం రూ.3,048 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అందులో భాగంగా భద్రాచలం- సత్తుపల్లి రైల్వే పనులకు రూ.160 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే పనులకు రూ.160 కోట్లు, అక్కన్నపేట-మెదక్ రైల్వే పనులకు రూ.41 కోట్లు, లింగంపేట జగిత్యాల-నిజామాబాద్ పనులకు రూ.39 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రూ. కాజీపేట-బల్హర్షా 3వ లైన్ ప్రాజెక్టుకు 550.43 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో 3వ లైన్ ప్రాజెక్టుకు రూ. 2,063 కోట్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ… తాజాగా కేటాయించిన నిధులతో మరింత శరవేగంగా పనులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణలో రైల్వే లైన్లను అభివ్రుద్ధి పర్చే విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ పై చర్చ సందర్భంగా రైల్వే పెండింగ్ పనులు, ఆర్వోబీ నిర్మాణ పనుల అంశాన్ని ప్రస్తావించనున్నట్లు అయన తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్రాన్ని కోరతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్ల కేటాయింపు అంశాన్ని కూడా సభలో ప్రస్తావించనున్నట్లు బండి సంజయ్ వివరించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.