అసోం సీఎం వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఆగ్రహం
హైదరాబాద్: రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. గాడిదలపై హిమాంత బిశ్వ శర్మ,అమిత్ షా,మోడీ చిత్ర పటాలను ఊరేగించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ బీజేపీ వెంటనే అసోం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి.
రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుకనే రాహుల్ గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించడం కాదు… అసోం ముఖ్యమంత్రిపై కేసులు నమోదు చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదు.అదంతా బీజేపీ ప్రచారం మాత్రమేనని అన్నారు.