సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. జనవరి 6 నుంచి అందుబాటులోకి!

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. జనవరి ఆరో తేదీ నుంచి 18 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ కోసం ఊర్లు వెళ్లే వారి సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడపనుంది. అంతేకాదు.. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే వసూలు చేయనుంది. 
అలాగే, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా బస్సులు నడపనుంది. విజయవాడ నుంచి 1000 ప్రత్యేక బస్సులను పలు ప్రాంతాలకు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల ద్వారా స్పెషల్ బస్సులకు టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు.

కాగా, తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే 4,233 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ స్పెషల్ బస్సులు జనవరి ఏడో తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. టీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు 125 అమలాపురం, 117 కాకినాడ, 83 కందుకూరు, 65 విశాఖపట్టణం, 51 బస్సులు పోలవరం, 40 బస్సులు రాజమహేంద్రవరానికి నడుస్తాయి.

Post bottom

Leave A Reply

Your email address will not be published.