51వ డివిజన్ లో మంత్రి వెల్లంపల్లి పర్యటన

విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలోని 51వ. డివిజన్ లో ఇంటింటికి తిరిగి వారి  సమస్యలను దేవాదాయశాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ల్లు మున్సిపల్ అధికారులు  పాల్గోన్నారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యా, వైద్య రంగాల పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సీఎం జగన్ రూ.12 కోట్లలు మంజూరు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోంది.  పనికిమాలిన పవన్ కళ్యాణ్ మాటలు రాష్ట్ర ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉద్యోగస్తుల సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏబీఎన్ రాధాకృష్ణ సీఎం జగన్ పాలన చూసి ఓర్చుకోలేక పోతున్నారు. దిక్కుమాలిన రాజకీయాలు చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రాధాకృష్ణ ఎప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగస్తులు సమ్మె చేస్తే పట్టించుకున్న సందర్భాలు లేవు.. పేమెంట్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ అని అన్నారు. పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

Tags: areanews app, vellampappy Srinivasa Rao, Pawan Kalyan, Chandrababu Naidu, devadaya shaka Mantri

Post bottom

Leave A Reply

Your email address will not be published.