ఆకట్టుకుంటున్న “వద్దురా సోదరా” మూవీ టీజర్
కన్నడ యంగ్ స్టార్ రిషి తెలుగులో అరంగేట్రం చేస్తున్న సినిమా “వద్దురా సోదరా”. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ నాయికగా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ “వద్దురా సోదరా” చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు. శనివారం “వద్దురా సోదరా” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంది.
టీజర్ లో …మానసిక సమస్యతో బాధపడుతున్న సాయి అనే యువకుడు జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. రైలు కిందపడటం, కరెంట్ షాక్ పెట్టుకోవడం ఇలాంటి సూసైడ్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇవన్నీ సఫలం కాలేదని, ఓ ముఠాకు తనను చంపమని సుపారీ ఇస్తాడు. అతన్ని చంపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. ఈ మానసిక సమస్య నుంచి కథానాయకుడు ఎలా బయటపడ్డాడు అనేది ఆసక్తికరంగా ఉండనుంది. టీజర్ చూస్తే ఇప్పటిదాకా తెరపై రాని ఒక కొత్త కథ “వద్దురా సోదరా” సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. సినిమా కామెడీ, ఎమోషనల్ వంటి అంశాలతో సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వద్దురా సోదరా” సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
నాగభూషణ, గ్రీష్మ శ్రీధర్, మహదేవ్ ప్రసాద్, భవానీ ప్రకాష్, అపూర్వ ఎస్ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విష్ణు ప్రసాద్ పి, దిలీప్ కుమార్ ఎంఎస్, ఎడిటింగ్ – గురుస్వామి టి, సంగీతం – ప్రసన్న శివరామన్, బ్యానర్స్ – స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్, నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, పీఆర్వో – జీఎస్కే మీడియా, అమ్రేజ్ సూర్యవంశీ, రచన, దర్శకత్వం – ఇస్లాహుద్దీన్.