షూటింగులో గాయపడిన సినీ నటుడు విశాల్.. వీడియో ఇదిగో..

ప్రముఖ సినీ నటుడు విశాల్ గాయపడ్డారు. ‘లాఠీ’ సినిమాలో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. బాలుడిని రక్షించే సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారిని పట్టుకుని కిందికి దూకే యత్నంలో చేతి ఎముకకు గాయమైనట్టు విశాల్ ట్వీట్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. అందులో ఆయన పోలీస్ అధికారిగా కనిపించారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ.వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రమణ, నంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునయన కథానాయిగా నటిస్తున్నారు. కాగా, ఫైట్‌ సీన్ చిత్రీకరిస్తుండగా స్వల్పంగా గాయపడినట్టు పేర్కొన్న విశాల్.. చికిత్స, విశ్రాంతి కోసం కేరళ వెళ్తున్నట్టు తెలిపారు. మార్చి తొలి వారంలో తిరిగి తుది షెడ్యూల్‌లో పాల్గొంటానని విశాల్ పేర్కొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.