తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత రెండు వారాలుగా ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పదివేలకు తగ్గకుండా కేసులు నమోదు అవుతుండడం గమనార్హం.
గడచిన 24 గంటల్లో 13,383 పాజిటివ్ కేసులు నమోదు కాగా 21,942 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 36,53,008కు చేరుకున్నది. కరోనా సోకి మరణించేవారి సంఖ్య వందకు సమీపంలో ఉంటున్నది. గత 24 గంటల వ్యవధిలో 90 మంది చనిపోగా, ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 19,584కు చేరుకున్నది.