సర్పంచ్ భర్త ఆగడాలు ఆపాలి
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త బింగి మీనపాండు అనే వ్యక్తి ఇదే గ్రామానికి చెందిన బొడుసు మాధవి భర్త ఎల్లయ్యని భూమి పంచాయతీ ఉందని గ్రామ పంచాయతీ వద్దకు పిలిపించి నీ భూమికి సంబందించిన దారి పంచాయతీ నాకిష్టం వచ్చినపుడు పంచాయతీ తీర్మానం చేస్తా అని వారిపై దురుసుగా ప్రవర్తించి ఒక మహిళా అని కూడా చూడకుండా వారిపై గొడ్డలితో దాడి చేశారు.
సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకుని అధికారం చేలాయిస్తూ భూమి పంచాయతీలో తలదూర్చి మాదవిని గొడ్డలితో దాడి చేయడంతో సదరు మహిళ భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్పంచ్ భర్త పాండు నుంచి మాకు ప్రాణభయం ఉందని తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన మాధవి కుటుంబ సభ్యులు.సర్పంచ్ భర్తపై తగు విచారణ జరిపి కేసు నమోదు చేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామని తుర్కపల్లి ఎస్ఐ తెలిపారు.