12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేసింది

న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ను 12 సంవత్సరాలు పైబడిన వారికి వినియోగించుకోవచ్చు.

గుజరాత్ రాష్ట్ర అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా జైకోవ్-డి వ్యాక్సిన్ ను దేశీయంగా అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావడంతో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ జైకోవ్-డి మూడు డోసుల వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపి డిసిజిఐ కు సిఫారసు చేసింది. డిసిజిఐ కూడా ఆమోదముద్ర వేయడంతో దేశీయంగా తయారు చేసిన రెండో వ్యాక్సిన్ గా గుర్తింపు లభించింది. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోసు, 45 రోజులు తరువాత మూడో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. సూది లేకుండానే ఇచ్చేస్తారు. మూడు డోసుల వ్యాక్సిన్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, మోడెర్నా, స్పత్నిక్-వి, జాన్సన్ అండ్ జాన్సన్  వ్యాక్సిన్ కు డిసిజిఐ అనుమతించిన విషయం తెలిసిందే.

Post bottom

Leave A Reply

Your email address will not be published.