రథ సారథి,మిర్యాలగూడ:
రథ సారథి వెబ్ సైట్ ఛానల్ ను ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు , ప్రముఖ డాక్టర్ మువ్వా రామారావు ప్రారంభించారు.స్థానిక జ్యోతి హాస్పిటల్ లో రథ సారథి వెబ్ సైట్ ఛానల్ ను మువ్వా రామారావు అట్ట హాసంగా ప్రారంభించారు.ఈ సందర్బంగా మువ్వా రామారావు మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేలా రథ సారథి తనవంతు గా కృషి చేయాలన్నారు.ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందుతున్న ప్పటికి కూడా సమాజంలో మూఢనమ్మకాలు ఏర్పడి ప్రజలను అంధకారంలోకి నెడుతున్నాయన్నారు.వాటిని రూపు మాపేలా రథ సారథి ముందుండా లన్నారు. ఈ కార్య క్రమంలో ప్రజాలహరి ఎడిటర్ చిట్యాల శ్రీనివాస్ రావు,పైలం పత్రిక ఎడిటర్ పేర్ల వెంకటయ్య, డేగ వెంకటేశ్వర్లు,శివ తదితరులు పాల్గొన్నారు.