రైళ్లను నిలపాలని వినతి
రథసారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో పలు రైళ్లను నిలుపుదల చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ తారకేశ్వరరావు కు వినతి పత్రం ఇచ్చారు. సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణంలో వెళ్ళు చెన్నై నారాయణద్రి, విశాఖ డెల్టా రైళ్లు మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయకుండా నల్గొండలో ఆపుతున్నారు అనీ,కాబట్టి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నార న్నారు.గతంలో ఈ ట్రైన్లు ఇక్కడ రైల్వే స్టేషన్లో ఆగేవి అనీ,కోవిడ్ కారణంగా , కోవిడ్ కారణం చూపుతూ మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైలు ఆపట్లేదు అన్నారు.కాబట్టి ఈ యొక్క వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపించి పలు రైళ్లను నిలుపుదల చేయాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళీ యాదవ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది ఎస్ఎస్సి రాజేశ్వరరావు సీనియర్ సెక్షన్ ఇంజనీర్,, కే వెంకట్ రెడ్డి పాండ్ మెన్, చిట్టి నాయక్ ట్రాక్మెన్, జేత్యా తండా ఉపసర్పంచ్ చిర్ర మల్లేష్ యాదవ్, జ్వాలా, నాయుడు, రైల్వే సిబ్బంది అశోక్, నాగేశ్వరరావు ,మంగ్య, తదితరులు పాల్గొన్నారు.