బడి ఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలి
రథ సారథి, మిర్యాలగూడ :
ఇటుక బట్టీల వద్ద పనిచేయుచున్న వలస కార్మికుల పిల్లలను పాఠశాలలకు పంపే బాధ్యత ఇటుక బట్టీల యజమానులు వహించాలని సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు రామచంద్రయ్య, వంగూరు వీరయ్య లు పేర్కొన్నారు. గూడూరు, కొత్తగూడెం గ్రామాల వద్ద ఇటుక బటీలలో పనిచేయుచున్న ఒరిస్సా వలస కార్మికుల పిల్లలను కలిసి వారందరూ భట్టీల వద్దనే చదువుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒరిస్సా నుండి వచ్చిన విద్యావంతున్ని వాలంటీర్ గా నియమించి మధ్యాహ్న భోజనం పుస్తకాలు ప్రభుత్వం ద్వారా అందించే ఏర్పాటు చేశారు. బడిబైటి పిల్లల సర్వేలో భాగంగా బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని వారందరూ పాఠశాలల్లో వయసుల వారీగా తరగతులు కేటాయించి వారి వారి భాషల్లోనే విద్యను అందించే బాధ్యత ఇటుక బట్టి పరిశ్రమ యజమానులు తీసుకోవాలని సూచించారు. వారి వెంట మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్ సి ఆర్ పి శ్రీనివాసచారి, ఇటుక బట్టీల యజమానులు రమణయ్య మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.