విరాట్ కోహ్లీ సెంచరీ
రథ సారథి:శ్రీలంక తో గౌహతి లో జరుగుతున్న ఒన్ డే క్రికెట్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసారు. మొత్తం 80 బంతుల్లో విరాట్ కోహ్లీ ఒన్డే మ్యాచుల్లో తన 45 వ సెంచరీ పూర్తిచేసారు.అన్ని ఫార్మాట్ లలో ఆయన 73 సెంచరీలు పూర్తిచేసారు. ఒన్ డే మ్యాచుల్లో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 49 సెంచరీ లు పూర్తిచేయగా విరాట్ 45 సెంచరీలు పూర్తి చేసి సచిన్ రికార్డుకు దెగ్గరలో వున్నారు.2019 ఏప్రిల్ తర్వాత విరాట్ కోహ్లీ స్వంత గడ్డపై సెంచరీ చేయడం విశేషం. శ్రీలంక పై అత్యధికంగా 9 సెంచరీ లు చేసి విరాట్ రికార్డ్ సాధించారు.విరాట్ కోహ్లీ సెంచరీ తో దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఒన్డే లో ఇండియా మొత్తం 50 ఓవర్లలో ఏడు పరుగుల నష్టానికి 373 పరుగులు చేసింది.