ఘనంగా కూడారై ఉత్సవాలు
రథ సారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ పట్టణం లోని హౌసింగ్ బోర్డు కాలనీ లో వెంచేసి వున్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ధనుర్మాసోత్సవాల సందర్బంగా బుధవారం కూడారై ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారికి గిన్నెల్లో పాయసాన్ని ప్రసాదంగా నివేదించారు.అనంతరం తిరుప్పావై పఠన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి , వేణుగోపాల్ రావు,రంగయ్య, శ్రీనివాస్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.