రథ సారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల కు మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళీ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయాలు మెడికల్ కాలేజీ పాలిటెక్నిక్ కళాశాల ఐఐటీ కళాశాల మిర్యాలగూడ కు వస్తాయన్నారు, అన్ని రంగాలలో మిర్యాలగూడ అభివృద్ధి చెందుతుంది అన్నారు. కార్యక్రమంలో జ్వాల వెంకటేశ్వర్లు, నాయుడు, సురేష్ నాయక్ జానీ మియా, సాదం లక్ష్మి, నరసింహ, స్వామీ తదితరులు పాల్గొన్నారు