రథ సారథి,మిర్యాలగూడ:
బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు,నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మమత దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని నాగార్జున నగర్ లోని చింత రెడ్డి నివాసంలో బుధవారం శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, ఆయన సతీమణి జయ మర్యాద పూర్వకంగా చింత రెడ్డి దంపతులను కలిసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.