రైస్ మిల్లులో జార్ఖండ్ కార్మికుడి మృతి       

 

రథ సారథి,మిర్యాలగూడ: 

మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి గ్రామంలోని వసుందర రైస్ మిల్లు లో మంగళవారం సాయంత్రం రేకుల షెడ్డు కూలి పడింది. ఈ ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోహైల్ (22) మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..జార్ఖండ్ రాష్ట్రము నుంచి ఉపాధి కోసం 8 మంది ముఠా గా మిర్యాలగూడ కు వచ్చారు. వీరిలో నలుగురు పది రోజులుగా వసుంధర రైస్ మిల్లు లో షెడ్డు నిర్మాణం పనులు చేస్తున్నారు. కాగా మంగళవారం మిల్లు గోదాం శెట్టర్ కి అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఇనుప పైప్ లపై నిలబడి రేకులు బిజిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారి గా ఐరన్ ఫ్రేమ్ ఊడి కింద పడింది. ఈ ప్రమాదంలో సోహైల్ (23), బిలాల్ ల తలల కు తీవ్ర గాయాలు కాగా పట్టణంలోని బాలాజీ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందించారు. సోహెల్ మృతి చెందగా పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి కి తరలించారు. బిలాల్ ని ఐసియూ లో చికిత్స అందిస్తున్నారు. మరో కార్మికుడు సైబాజ్ కాలికి తీవ్ర గాయం కాగా జీవీ ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.