విద్యుత్ సరఫరా ఉండదు
రథసారథి, మిర్యాలగూడ :
రేపు అనగా బుధవారం తేదీ: 21/08/2024 నాడు ఉదయం 8గంటల నుండి 10 గంటల వరకు ఎఫ్ సి ఐ సబ్ స్టేషను నుండి వచ్చే 11 కెవి హనుమాన్ పేట ఫీడర్ కింద నేషనల్ హైవే వారి టవర్లు నిర్మించుట కొరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును అని,కావున ఈ ఫీడర్ పరిధిలో ఉన్న సాగర్ రోడ్ లో కొంత భాగం అనగా ఫ్లై ఓవర్ దగ్గర ఉన్న వైన్స్ దగ్గర నుండి సోనోవిజన్ షాపు వరకు ఒకవైపు మాత్రమే విద్యుత్ సరఫరా ఉండదు అని మిర్యాలగూడ టూ టౌన్ విద్యుత్ శాఖ ఏఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు.కావున గృహ, వాణిజ్య వినియోగదారులు, ప్రజలు విద్యుత్ సిబ్బందికి మరియు అధికారులకు సహకరించగలరని ఆయన కోరారు.