ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి..ఎమ్మెల్యే బత్తుల
రథ సారథి, మిర్యాలగూడ:
రేపు ఉదయం 7:30 గంటలకు మన జాతి పిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
అనంతరం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.కావున మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా వారి వారి మండలాలలో మరియు వారి గ్రామాలలో గల ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల వారు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.అలాగే మిర్యాలగూడ పట్టణంలోని , ఏరియా ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్ మరియు డాక్టర్స్ కాలనీలలో నిర్వహించబోయే స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల వారు రాజకీయ నాయకులు, ప్రజలు అందరూ కలిసి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్న ట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.