రథసారధి , ఢిల్లీ:
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆర్థిక సంస్కర్తగా పేరుపొందిన మన్మోహన్ సింగ్(92) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో గురువారం రాత్రి కన్నుమూశారు.2004 నుండి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పనిచేశారు. ఐదు పర్యాయాలు ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రులలో మన్మోహన్ సింగ్ ఒకరు గా నిలిచారు.1932 సంవత్సరంలో అవిభక్త పంజాబ్ రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ ,కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ , పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.