ఓయూలో నిరసన

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు రాష్ట్రం కు. విద్యారంగం తో పాటు ఇతర రంగాలకు నిధుల కేటాయింపుల్లో… కేంద్రం  అన్యాయం చేసిందని టిఆర్ఎస్వి విద్యార్థి  సంఘం అధ్యక్షుడు గెల్లు  శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనకు దిగారు. ధర్నా చేసారు.  ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో.. విద్యా రంగం కు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు అలసత్వం వహించింది. విభజన చట్టం ప్రకారం ఇవ్వవలసిన.. విద్యా సంస్థలకు ఇప్పటివరకు నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం కు బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్యాయం చేస్తుందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని తెలంగాణ రాష్ట్రం కు విద్యారంగంలో కేటాయింపులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రతినిధిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.