ఎల్ఐసి ఏజెంట్ల సంఘ భవన నిర్మాణ స్థలానికి మంత్రికి వినతి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి బ్రాంచ్ పరిధిలో పనిచేసే ఏజెంట్ల సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఏజెంట్ల సంఘం అధ్యక్షులు ఏ. వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి పి. ఐలయ్య, కోశాధికారి జున్ను మల్లయ్య ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. బ్రాంచ్ పరిధిలో 1000 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారని సంఘ భవనం నిర్మాణానికి పది గంటల స్థలాన్ని కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
సంఘ సభ్యుల విజ్ఞప్తి కి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండయ్య, గాదె రమేష్, కట్ట నరసయ్య, కొక్కు లక్ష్మణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.