1 నుంచి స్కూళ్లు తెరుస్తారు: తెలంగాణ
హైదరాబాద్: రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెరుస్తారని, ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విద్యా సంస్థ పునఃప్రారంభం పై సిఎం కెసిఆర్ విద్యాశాఖ మంత్రి, అధికారులతో సమావేశమయ్యారు.
కరోనా మహమ్మారితో గతేడాది మార్చి నెలలో విద్యా సంస్థలు మూసివేశారు. అప్పటి నుంచి ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నారు. గత నెలలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోగా, హైకోర్టు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు స్వల్ప సంఖ్యలో నమోదు అవుతున్నట్లు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలు పునఃప్రారంభించాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న సిఎం కెసిఆర్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు.