ఇండియా ఎంబసీ పై తాలిబన్ల దాడి

కాబూల్: ప్రభుత్వాన్ని కబ్జా చేసిన తాలిబన్లు ఇళ్లిళ్లూ గాలిస్తూ కన్పించిన యువతులను ఎత్తుకెళ్లిపోతున్నారు. దేశంలోని రాయబార కార్యాలయాలను ముట్టడించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా దేశ రాయబారి తమ దేశ జెండా కూడా తాలిబన్లకు దొరక్కుండా ఆ దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే.

కాందహార్, హీరత్ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయం చేరుకున్న తాలిబన్లు ఒక్క కాగితం కూడా విడిచిపెట్టకుండా తమ వెంట తీసుకువెళ్లిపోయారు. అలాగే కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్ లను కూడా వదిలిపెట్టలేదు. తాలిబన్లు దేశం స్వాధీనం చేసుకోవడానికి ముందుగానే అక్కడ పనిచేస్తున్న దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో వెనక్కి తీసుకువచ్చింది. ఈ చర్య కారణంగా పలువురు ఉద్యోగులకు ప్రాణ ముప్పు తప్పింది. ప్రస్తుతం స్వల్ప సంఖ్యలో మాత్రమే సిబ్బంది పనిచేస్తున్నారని భారతదేశ రాయబారి రుద్రేంద్ర టండన్ తెలిపారు. కాబూల్ నగరంలో ఇళ్లిళ్లూ తిరిగి తాలిబన్లు వివరాలు సేకరిస్తున్నారు. యువతులు ఉన్నట్లయితే భయపెట్టి, బెదిరించి ఎత్తుకెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు అడ్డు వస్తే తుపాకులతో బెదిరిస్తున్నారు. అయితే ఈ వార్తలు ఏ మీడియాలో కవరేజి రాకుండా చూస్తున్నారు. ఇప్పటి వరకు దేశ భద్రత కోసం పనిచేసిన వారి ఇళ్లకు వెళ్లి కాల్చి పారేస్తున్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.