వైసిపి లోకి టిడిపి ఎమ్మెల్యే!
అమరావతి: మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించనున్నట్లు తెలిసింది.
పార్టీ అధినాయకత్వం కొద్ది రోజులుగా తనపట్ల చిన్నచూపుగా వ్యవహరించడంతో వైదొలగాలని బుచ్చయ్య నిర్ణయించుకున్నారు. నమ్ముకున్న సీనియర్లను నారా లోకేశ్ తీవ్రంగా అవమానిస్తున్నారనే బాధ కొద్ది రోజులుగా వ్యక్తమవుతున్నది. నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ లకు పలుమార్లు ఫోన్లు చేసినా ఎత్తకపోవడం, స్పందించకపోవడంతో బుచ్చయ్య పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీ వీడిని తరువాత బిజెపిలోకి చేరతారా లేదా వైసిపి తీర్థం పుచ్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. గత మూడు నాలుగు నెలలుగా వైసిపిని తూలనాడడం లేదు.