సుప్రీమ్‌ ‌కోర్టుకు దిశ ఎన్‌కౌంటర్‌ ‌నివేదిక

57 మంది సాక్ష్యులను విచారించిన సిట్‌
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ ‌నివేదికను సుప్రీమ్‌ ‌కోర్టుకు సమర్పించింది. 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్‌.. ‌జనవరి 28న సుప్రీమ్‌కు నివేదిక అందించింది. ఈ కేసుకు సంబంధించి కమిషన్‌..అప్పటి సీపీ సజ్జనార్‌, ‌సిట్‌ ‌ఛైర్మన్‌ ‌మహేశ్‌ ‌భగవత్‌, ‌శంషాబాద్‌ ‌డీసీపీతో పాటు పలువురు పోలీసులు అధికారులు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను విచారించింది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసులపై కాల్పులు జరపడం వల్ల ఎన్‌కౌంటర్‌ ‌చేసినట్లు అప్పటి సీపీ సజ్జనార్‌ ‌తెలిపారు.

ఈ కేసుపై రాచకొండ సీపీ ఛైర్మన్‌గా సిట్‌ ‌కూడా ఏర్పాటైంది. అనంతరం 2019 డిసెంబర్‌ 12‌న సుప్రీమ్‌ ‌కోర్టు.. సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ను నియమించింది. 2019 డిసెంబరు 6న… దిశ అత్యాచార నిందితులు నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాయారు. ఆ ఎన్‌కౌంటర్‌ ‌జరిగిన విధానంపై నిజనిర్దారణ చేసేందుకు సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ ‌క్షేత్రస్థాయిలో పర్యటించి..నిందితుల కుటుంబసభ్యులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు సహా సంబంధిత అధికారులను విచారించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ ‌నివేదికలు పరిశీలించింది. 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.