రాజ్యాంగం మార్చాలనడం మూర్ఖత్వం

  • తప్పులు కప్పిపుచ్చుకునేందుకే తెరపైకి
  • 317 జీఓను మార్చాల్సిందే
  • ఉద్యోగాల భర్తీ దయాదాక్షిణ్యం కాదు
  • కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, పిబ్రవరి 2 : రాజ్యాంగాన్ని మార్చాలన్నసిఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అంబేడ్కర్‌ను కెసిఆర్‌ అవమానిస్తున్నారని పలువురు నేతలు మండిపడ్డారు. మరోసారి రాజ్యాంగం మారుస్తామనే చర్చ తెస్తే తీవ్ర నిరసన ఎదుర్కునాల్సి వొస్తుందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌హెచ్చరించారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ…పోరాటాలతో తెచ్చుకున్న రాజ్యాంగం మార్చి ఏ రాజ్యాంగం తెస్తా అనుకుం టున్నారని ప్రశ్నించారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. 317 జీవోను సవరించాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు. ఫ్యూడల్‌ ఆలోచనలు ఉన్న కేసీఆర్‌కు ఈ రాజ్యాంగం ఏం అర్థం అవుతుందని యెద్దేవా చేశారు. నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యాంగం మార్పు చేస్తామంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామిక..అరాచక పాలనను ఎదుర్కునేందుకు త్వరలోనే ప్లీనరీ నిర్వహించుకుని.. తీర్మానాలు చేయ నున్నట్లు తెలిపారు. ఇరిగేషన్‌ ‌సెక్రటరీ రజత్‌కుమార్‌పై వొచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. కూడబలుక్కుని విలాసాలు.. విందులకు ఖర్చు చేస్తా అంటే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. కొరోనా తరువాత ఆర్థిక అసమానతలు పెంచేలా బడ్జెట్‌ ఉం‌దన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు బ్జడెట్‌ ‌రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. మనుషుల మధ్య అంతరాలు తొలగించేందుకు రాజ్యాంగం ఉపయోగ పడుతుందని అంబేద్కర్‌ ‌చెప్పారని టీజేఎస్‌ అధినేత గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంను తిడుగుతున్నట్టు కనిపించే కేసీఆర్‌ అదే పంథాను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం మారాలని చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు తెలిపారు.

ఎప్పుడు ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరని… ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా లాఠీ చార్జి చేశారన్నారు. ముఖ్యమంత్రికి చెప్పుకుం దామని బయలుదేరితే మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లనసాగర్‌ ‌బాధితులను 144 సెక్షన్‌ ‌పెట్టి లాఠీ ఛార్జ్ ‌చేయించారని ఆరోపి ంచారు. యువకులు ఉద్యోగాలు కోసం పోరాటం చేస్తే పట్టించు కోలేదన్నారు. పీజీ..పీహెచ్‌డి చేసిన వారు ఖాళీగా ఉన్నారని తెలిపారు. 50 వేల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారని.. దానమా ధర్మమా అని ప్రశ్నించారు. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాల్సిందే అని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పటికీ బతుకు దెరువు లేక దుబాయ్‌.. ‌ముంబాయి పోయి అవస్థ పడుతున్నారన్నారు. కేసీఆర్‌ ‌రాజ్యాంగం రాస్తా అంటే అది నిరంకుశ రాజ్యాంగం అయి ఉంటుందని విమర్శించారు. అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటు చేసారని.. ఆ తప్పుని కప్పిపుచ్చు కోవడం కోసం స్థానికత అంటున్నారని మండిపడ్డారు. స్థానికతకు గుర్తింపు లేకుండా చేసేందుకే 317 జీవో అని అన్నారు. ఉద్యోగులు సిఎం సెక్యూరిటీ గార్డులు కాదని.. ఆయన ఫామ్‌ ‌హౌస్‌లో కూలీలు కాదని అన్నారు. 317జీవో రాజ్యాంగ విరుద్ధమని..దాంతో ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారని కోదండరామ్‌ ‌వ్యాఖ్యానించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.