పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
రథసారథి, మిర్యాలగూడ :
అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు పంచి ఇవ్వాలిని వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరు గోవర్ధన అన్నారు.బుధవారం వేములపల్లి మండల కేంద్రములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర ఏండ్లు గడుస్తున్నా ఇంకా ఎంతో మంది ఇండ్ల స్థలాలు,ఇండ్లు లేని దుస్తితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను అర్హులైన పేదలందరికీ వెంటనే పంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇండ్ల స్థలాలు ఉన్న వారు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరినారు.లేని పక్షంలో పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి పాదూరు శశిధర్ రెడ్డి,పతాని శ్రీను,రవి తదితరులు పాల్గొన్నారు.