చిరు వ్యాపారస్థులకు ప్రత్యేక స్థలం ఇవ్వాలి
రథసారథి,మిర్యాలగూడ: తోపుడు బండ్లు, ఫుట్ ఫాత్ ల పై వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక స్థలం కేటాయించాలని, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానికంగా ఆయన మాట్లాడారు. తోపుడు బండ్లు వలన ట్రాఫిక్ ఇబ్బందులు గురవుతున్నాయని ఛైర్మన్ చెప్పటం విచారకరం అన్నారు. సాగర్ ప్రధాన రహదారి పై వ్యాపారాలు విస్తరించి ఉన్నందున వాటికి అనుసంధానంగా చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారం సాగిస్తారని పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయముతొలగేలా మున్సిపాలిటీ అధికారులు చిరు వ్యాపారస్తులందరికీ ఒకే దగ్గర స్థలం చూపించినట్లయితే అక్కడే వ్యాపారాలు చేసుకుంటారని పేర్కొన్నారు. గతంలో రత్నయ్య లాడ్జింగ్ పక్కన స్థలంలో గోడౌన్లు తొలగించి చిరు వ్యాపారస్తులందరికీ ఆ స్థలానికి కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినదన్నారు. ఇప్పటి కైనా ఆ స్థలములో అమ్ముకునే విధంగా చూడాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.