బీసీలు రాజకీయంగా ఎదగాలి :జాజుల
రథ సారథి, మిర్యాలగూడ :
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర బీసీ సంక్షేమ సంఘం కాలమానిని పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీసీ కుల సంఘాల నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండి,ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ నూతన సంవత్సరంలో బీసీలు రాజకీయంగా రాణించాలని, అన్ని రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల యొక్క రాజకీయ ఆర్ధిక ఎదుగుదలకు చేయూత అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాళపల్లి రవి,బంటు వెంకటేశ్వర్లు, గుండెబోయన నాగేశ్వరరావు యాదవ్,మహేష్ గౌడ్,జయమ్మ,ఎర్రబెల్లి దుర్గయ్య,కవిత,కుమ్మరికుంట్ల సుధాకర్,దాసరాజ్ జయరాజ్,ఫారూఖ్, మురళి,సత్యనారాయణ,సావిత్రి,విజయ్,వంశీ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.