సాంఘిక శాస్త్ర ప్రతిభ పాఠవ పోటీలు
రథసారథి,మిర్యాలగూడ :
భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని జనవరి 03 వ తారీఖున సాంఘిక శాస్త్ర ఫోరం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మూడు రెవిన్యూ డివిజన్ల యందు పాఠశాల యాజమాన్యాల (ZPHS, KGBV, Govt, TSMS, Residential, ప్రవేట్) వారిగా ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించనున్నట్లు సాంఘిక శాస్త్ర ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లమేకల వెంకయ్య తెలిపారు.
మిర్యాలగూడ డివిజన్ ప్రాంత విద్యార్థులు జెడ్ పి హెచ్ ఎస్ బకల్వాడి, దేవరకొండ డివిజన్ ప్రాంత విద్యార్థులు జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ దేవరకొండ, నల్లగొండ డివిజన్ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (కే పి ఆర్ ఎం) నల్లగొండ యందు పరీక్ష పోటీలలో పాల్గొనవలసినదిగా తెలిపారు.
డివిజన్ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు జనవరి ఏడవ తారీఖున జిల్లా స్థాయిలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రతిభా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఆయన వెంట వివిధ డివిజన్ల బాధ్యులు పులిపాటి సత్యనారాయణ, ఎన్.సైదులు,చల్లా రవికుమార్, డి నరసింహ నాయక్, జే. బక్కయ్య, ఎం కృష్ణవేణి, రామతులసి, కల్పన,వంగాల ప్రభాకర్ రెడ్డి, ఏ సైదులు, శ్రీనివాసరెడ్డి, రహీం, వెంకట్ రెడ్డి, కోటయ్య, మంజుల, మల్లీశ్వరి, అమరేందర్ రెడ్డి, వీరనారాయణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు