ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
రథసారథి, మిర్యాలగూడ :
వైకుంఠ ఏకాదశి సందర్బంగా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. ధనుర్మాసం సందర్భంగా భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు కారంపూడి రాఘవాచార్యులు తిరుప్పావై అర్ధాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సూదిని వెంకటరెడ్డి, కార్యదర్శి చెన్నూరు వేణుగోపాలరావు కన్నెగుండ్ల రంగయ్య శ్రీనివాస్, కమలాకరాచార్యులు ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు