నిత్య ఉచిత అల్పాహారం వితరణ
రథ సారథి,మిర్యాలగూడ :
లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో
మీల్స్ ఆన్ వీల్స్ 55వ రోజు
సోమవారము ఉదయము మిర్యాలగూడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహారము వితరణ చేపట్టారు.
దాత గా లయన్ కోల సైదులు ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా మరియు బండారు కుశలయ్య దంపతులు,మరియు
కీర్తిశేషులు రత్నకుమారి జ్ఞాపకార్థం వారి భర్త చుండూరు భాస్కర రావు ముందుకొచ్చారు.ముఖ్య అతిథులుగా లయన్ మా శెట్టి గీత మరియు లయన్ కోల జయ విచ్చేశారు.
ఈ కార్యక్రమమునకు లయన్ రీజనల్ చైర్మన్ మా శెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ జె రాజు, లయన్ యనగండ్ల లింగయ్య, లయన్ ఏచూరి భాగ్యలక్ష్మి, లయన్ ఏచూరి మురహరి, లయన్ కోల సైదులుముదిరాజ్, లయన్ బి .ఎం .నాయుడు. మరియు
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.