తిప్పనకు సన్మానం
రథసారథి,మిర్యాలగూడ:
ధనుర్మాసం, ముక్కోటి ఏకాదశి పర్వదినాల సందర్భంగా మిర్యాలగూడ మండలం అవంతిపురం లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు సరస్వతీ దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్, మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి దంపతులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగ దేవాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ శరత్ బాబు గారు వేదపండితులతో పూర్ణకుంభంతో ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు చేసినారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో టిఫిన్ ఏ సింహారెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా తిప్పన ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజే సారు.ఆయన వెంట మిర్యాలగూడ మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్ , మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ వెలిశేట్టి రామకృష్ణ,ఎంపీటీసీలు వెలిశెట్టి కృష్ణవేణి,ఇస్లావత్ సుజాత బాలు,వల్లపు దాసు సుజాత సురేష్, సర్పంచులు దుగ్యాల వెంకన్న,పంతంగి శోభారాణి సైదులు,పోలగాని శ్రీనివాస్,చౌగాని బిక్షం గౌడ్,గజ్జల జయమ్మ కోటిరెడ్డి,భోగబోయిన రాజు, మండల పార్టీ ఉపాధ్యక్షులు చెల్లమాల పద్మయ్య,మాజీ సర్పంచులు చిమట పద్మ మదర్,చింతల వెంకటేశ్వర్లు, దారం సైదులు,చలి కంటి యాదగిరి,ముత్తయ్య, మాజీ ఎంపీటీసీ లింగయ్య, నాయకులు పూసపాటి రాజాలు,చామర్తి వెంకటేశ్వర్లు,లావుడి శ్రీహరి,ధనావత్ చిన్య నాయక్,సప్పిడి చంద్రారెడ్డి,రామ్ రెడ్డి,వెంకట్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి, నారాయణరెడ్డి,జరుపల సేవ, భూక్య బిక్షం,భూక్య నాగేందర్, బద్రి,రాము,రంజిత్,బోడ వెంకన్న వార్డు సభ్యులు సైదులు,కృష్ణ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రశాంత్, కుక్కడపు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.