కనీస వేతనాలు ఇవ్వాలని కలెక్టర్ కు వినతి

రథ సారథి, మిర్యాలగూడ :

జీవో 60 ప్రకారం రాష్ట్ర పశు సంస్థలో పనిచేస్తున్న పశుమిత్రులకు కనీస వేతనాలు ఇవ్వాలి అని నల్గొండ జిల్లా కలెక్టర్ కు పశు మిత్రులు సోమవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2500 మంది పశువు మిత్రులు గత ఎనిమిది సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారని వారు తెలిపారు.ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, కావున జీవో 60 ప్రకారం పశుమిత్రులకు కనీస వేతనాలి వ్వాలని వారు కోరారు. పశుమిత్రులకు వేతనం నిర్ణయించాలని , టి ఏ లు డిఏలు కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు వినతి పత్రం లో కోరారు. ఈ కార్యక్రమంలో జేరిపోతుల సునీత, మనిషా, దుర్గ భవాని, రాధిక, శ్రీదేవి, అనూష, ప్రవళిక, మాధవి, సంధ్య ,మంజుల, కృష్ణవేణి, రేణుక ,మమత, శిరీష ,స్వాతి, కావేరి, మౌనిక ,భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు

Post bottom

Leave A Reply

Your email address will not be published.