గోత్ర నామాలతో క్యాలెండర్ తయారీ అద్భుతం : సంగారెడ్డి కలెక్టర్ శరత్
రథసారథి,మిర్యాలగూడ :
ఆధునిక సాంకేతికతతో గోత్రనామాలపై నేటి బంజారా యువకులకు అవగాహన లేదని అలాంటి సందర్భంలో గోత్రనామాలను గుర్తించి బంజారా అఫీషియల్ పేరుతో ప్రత్యేకంగా క్యాలెండర్ ను తయారుచేసి ఉద్యోగులకు అందించడం అద్భుతమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడావత్ శరత్ నాయక్ అన్నారు. మంగళవారం దామరచర్ల మండలం పార్థు నాయక్ తండాలో బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బంజారా అఫీషియల్ పేరుతో ప్రచురించబడిన 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. బంజారా పండుగలు, బంజారా సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా క్యాలెండర్ తయారు చేయబడిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆడావత్ మహేందర్ నాయక్, జైత్రం నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్, జితేందర్ నాయక్ ఆనంద్ నాయక్ జామ్లా నాయక్ సైదా నాయక్ మురళి మక్లా నాయక్ భీమ్లా నాయక్ బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు.
దశరత్ నాయక్ కు సన్మానం:-
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్ ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడవత్ శరత్ నాయక్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉద్యోగ,ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారాన్ని కృషి చేయడం అభినందనీయమనీ అన్నారు. సమస్యల సాధన కోసం ఉద్యోగుల పక్షాన నిలబడి ముందుండి పరిష్కారానికి కృషి చేస్తున్న దశరథ నాయక్ కృషిని కొనియాడారు.