8 న పోరుయాత్ర ముగింపు సభ…జాజుల
రథ సారథి,మిర్యాలగూడ
చదువుతో పాటు సామాజిక న్యాయసాధన కోసం గత నెల రెండో తేదీన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి ప్రారంభమైన బీసీ విద్యార్థి,యువజనుల ముగింపు సభను 8న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ విద్యార్థులందరికి స్కాలర్ షిప్స్,ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.బీసీల జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని లింగంగౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్,సాయి, శివ,రఘు,సాయితేజ, మధు,వేణు, మణికంఠ, రవి,కొటేశు, అశోక్,శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు