జాజులలింగం గౌడ్ కు స్వామి వివేకానంద యూత్ అవార్డ్
రథ సారథి, మిర్యాలగూడ :
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గాన సభలో నిర్వహించిన స్వామి వివేకానంద160వ జయంతి సందర్భంగా వివిధ యువజన సమస్యలపై పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కు స్వామి వివేకానంద యూత్ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ చేతులమీదుగా అందజేశారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత లింగంగౌడ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారత జాతీ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటారని,ఆయన యొక్క ప్రసంగాలు ప్రతీ ఒక్కరినీ తట్టి లేపేవిధంగా ఉంటాయని అన్నారు.అతని మాటలకు భారత దేశమంతా తన్మయత్వంతో ఊగిపోయేదన్నారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయేటందుకు యువత నడుంబిగించాలి.ఈ కార్యక్రమంలో తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్,చంద్రమౌళి,సాదావారి సాయి,నక్క శ్రీనివాస్ యాదవ్,సుమతి తదితరులు పాల్గొన్నారు.