ఖమ్మం సభలో మిర్యాలగూడ ను జిల్లాగా ప్రకటించాలి
రథ సారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు మిర్యాలగూడ ప్రజల ఆకాంక్ష అని ఈనెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మిర్యాలగూడ జిల్లాను ప్రకటించాలని జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళి యాదవ్ కోరారు. సోమవారం మిర్యాలగూడ లోని ఎన్నెస్పి క్యాంపు గ్రౌండ్ లో కరాటే విద్యార్థులకు జిల్లా ఏర్పాట విషయమై అవగాహన కల్పించారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుతో పరిసర ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు విద్య వైద్యరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని రకాల కార్యాలయాలు మిర్యాలగూడలో ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు,నాయుడు,సుమన్ కోటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.