జిల్లా సదస్సును విజయవంతం చేయాలి
రథ సారథి, మిర్యాలగూడ :
జనవరి 19న చిట్యాల లో జరగనున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల సదస్సుకు మహా జననేత మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని గ్రామాలు మరియు మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని మహాజన సోషలిస్ట్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ మచ్చ ఏడుకొండలు మాదిగ పిలుపునిచ్చారు.మిర్యాలగూడ లో ఆయన మాట్లాడుతూ జనవరి 6న బెంగళూరులో తీసుకున్న నిర్ణయాల కార్యచరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని, ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేసారు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనాధ పిల్లల కొరకు వారి హక్కుల సాధన దిశగా మరో సామాజిక ఉద్యమానికి సంసిద్ధం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మిర్యాలగూడ మండల ఇన్చార్జ్
సండ్ర నాగరాజు మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మడుపు శ్రీనివాస్ మాదిగ, దామరచర్ల మండల ఇంచార్జ్ యాం పొంగు ప్రసాద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇరుగు ఎల్లన్న మాదిగ, మేకల పవన్ కళ్యాణ్ మాదిగ, నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.