ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి
రథసారథి,మిర్యాలగూడ:
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా సుందర్ నగర్ టిడిపి కార్యకర్తల ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని ఆర్డిఓ ఆఫీస్ వద్ద తెలుగుదేశం పార్టీ పతాక ఆవిష్కరణ గావించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశల వెలుగెత్తి చాటిన మహనీయులుగా కొనియాడారు .పటేల్, పట్వారి వ్యవస్థను రద్దుచేసి తర తరాల పరిపాలనకు స్వస్తి పలికి బహుజనులకు రాజకీయ అవకాశం కల్పించి, పేద బడుగు బలహీన వర్గాలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదవారి ఆకలి తీర్చిన మహానుభావుడు అని వారు
కొనియాడారు. అటువంటి మహనీయుని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ,దేశంలో నిస్వార్థమైన రాజకీయాలు చేయాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు కాసుల సత్యం, జడ రాములు యాదవ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంజకొండలు ,గుంజ వాసు, ముక్కెర అంజిబాబు ,శ్రీను, రవి ,సైదులు ,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.