మాజీ సర్పంచ్ మృతికి సంతాపం
రథ సారథి, మిర్యాలగూడ:
మాడుగుల పల్లి మండలం పోరెడ్డి గూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెన్న కమలమ్మ అనారోగ్య కారణంతో మరణిం చారు. ఆమె పార్థీవ దేహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేములపల్లి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాదూరు శశిధర్ రెడ్డి , వేములపల్లి వైస్ ఎంపీపీ పాధూరు గోవర్ధన , మాడుగులపల్లి మండల కార్యదర్శి రొండ్డీ శ్రీనివాస్ ,పిండి వెంకట్ రెడ్డి తంగేళ్ల నాగమణి , ఊటుకూరు మల్లారెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు తదితరులున్నారు.