నిందితులను కఠినంగా శిక్షించాలి

రథ సారథి, మిర్యాలగూడ:

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని అంగడిపేటలో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బిసి సంఘం మహిళా నాయకురాలు బంటు కవిత, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్ డిమాండ్ చేశారు. బిసి సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడుతూ
గుర్రంపోడ్ మండలం మైలాపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికను నమ్మబలికించి కారులో ఎక్కించుకొని అంగడిపేట లోని వస్త్ర దుకాణం లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత బాలిక కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సత్వరమే శిక్షలు పడేవిధంగా చూడాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించాలని వారు ఈ సందర్భంగా కోరారు. సత్వరమే మహిళా కమిషన్ చైర్మన్ బాధిత కుటుంబాన్ని సందర్శించి భరోసా కల్పించి, ప్రభుత్వం ద్వారా రావలసిన ఎక్స్ గ్రేషియా అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయమ్మ, దుర్గా రమణ,ఫారుక్, బంటు వెంకటేశ్వర్లు, సునీతా రమ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.