ఎమ్మెల్యే భగత్ నివాళులు
రథ సారథి, మిర్యాలగూడ:
తెలంగాణ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్,తిరుమలగిరి సాగర్ ఎమ్మార్వో ఇస్లావత్ పాండు నాయక్ ల మాతృమూర్తి ఇస్లావత్ సీవీ దశదినకర్మ కార్యక్రమంలో నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ,ఎమ్మెల్సీ లు ఎంసీ కోటిరెడ్డి ,అలుగుబెల్లి నర్సిరెడ్డిలు పాల్గొన్నారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్, శంకర్ నాయక్, బంజారా నాయకులు బన్సీలాల్ నాయక్,ఠాగూర్ నాయక్, యాదవ సంఘం మిర్యాల డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.