బంజారా అఫిషియల్ క్యాలెండర్ ఆవిష్కరణ
రథ సారథి, మిర్యాలగూడ:
బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బంజారా అఫీషియల్ పేరుతో రూపొందించిన 2023 క్యాలెండర్ ను జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పరిపాలన అధికారి మూడ్ మోతిలాల్ నాయక్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఉపయోగపడే రీతిలో క్యాలెండర్ ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్, బంజారా ఉద్యోగ సంఘం నాయకులు రామచంద్రయ్య,శంకర్ నాయక్, వెంకటేశ్వర్లు, శ్యామల, ఠాగూర్ బన్సిలాల్ మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ లోని డిఈఓ కార్యాలయంలో సైతం క్యాలెండర్ ను ఆవిష్కరించారు.