ఉచిత అల్పాహారం పంపిణీ
రథ సారథి, మిర్యాలగూడ:
లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం మరియు ఈ_ వేస్ట్ కార్యక్రమం లయన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు . గూడూరు కొసలేంద్ర జన్మదినం సందర్భంగా అతని తండ్రి గూడూరు శ్రీనివాస్ రావు అడ్వకేట్ మరియు కీర్తిశేషులు చెన్ బసమ్మ సంవత్సరికం పురస్కరించుకొని వారి కుమారులు లయన్ మటమ్ పరమేశ్వర్ ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. ముఖ్య అతిథిలుగా మిర్యాలగూడ ప్రధమ పౌరుడు మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగరు భార్గవ్ మరియు 28వ వార్డు కౌన్సిలర్ ఎండి ఖాదర్ విచ్చేశారు. అనంతరం తిరునగర్ భార్గవ్ మాట్లాడుతూ 74 రోజుల మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్న లయన్ మాశెట్టి శ్రీనివాస్ ని అభినందించారు. మరియు ఈ_ వేస్ట్ కార్యక్రమం చేపట్టాలని ,మిర్యాలగూడ మున్సిపాలిటీ ద్వారా అందుకు సంబంధించిన ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందిస్తానని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలందరూ ఈ_వేస్ట్ కార్యక్రమంలో పాల్గొని మీ ఇంటిలోని ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయనివి ఎన్ని ఉన్నా మాకు అప్పగించాలన్నారు. తాము రీసైకిల్ చేయడం లేదా డిస్ట్రాయ్ చేయడము ఒక పద్ధతి ప్రకారం చేస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఎంజెఎఫ్ మాశేట్టి శ్రీనివాసు, లయన్ ఎనగండ్ల లింగయ్య , లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి , భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి ,లయన్ కోల సైదులు ముదిరాజ్, లయన్ బి .ఎం .నాయుడు, గుంటూరు సత్యనారాయణ , పద్మ ,వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.