చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సన్మానం
రథ సారథి, మిర్యాలగూడ:
రైతు బంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మిర్యాలగూడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. నిత్యం ప్రజల సమస్యపై స్పందించే శ్రీనివాస్ రెడ్డికి రైతుబంధు సంస్థ చైర్మన్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం మిర్యాలగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్, ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ సైదా నాయక్, టిఆర్ఎస్ నాయకులు జెట్టి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.