మినీ శిల్పారామంలో సందడే సందడి
రథ సారథి, హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలో నిత్యం ఉరుకులు పరుగులు పెట్టే ప్రజలకోసం కాస్త ఆట విడుపు గా ఉండేలా ప్రభుత్వం ఉప్పల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మినీ శిల్పారామం సందర్శకులతో సందడి నెలకొంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రకృతి వనాలు, నోరూరించే తినుబండారాలు , కనువిందు చేసే అందాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఆదివారం సెలవు దినం రోజున సిటీ ప్రజలు కుటుంబ సభ్యులతో శిల్పారామం సందర్శించి సందడి చేశారు. సందర్శకులను ఆనందింప చేయడానికి మినీ శిల్పారామంలోని సాంస్కృతిక కళావేదికపై పల్లవి అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ గురువు పిబి కృష్ణ భారతి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పూర్వ రంగం, గణేశా పంచరత్న కీర్తన, అష్టపది, నీలమేఘ శరీర, సాంబశివ, ఒకపరి కొకపరి, స్వాగతం కృష్ణ, పలుకు తేనెల తల్లి, తిల్లాన అంశాలను అమృత, శిరీష, శ్రీకృతి, రితిక, అనన్య, వర్ష మొదలైన ప్రదర్శనలు ప్రదర్శించారు.ముఖ్య అతిధులుగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటాచారి, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ హిమబిందు కనోజ్ విచ్చేసి కళాకారులను అభినందించారు.