రామప్ప ఆలయాన్ని సందర్శించిన మంత్రి
రథ సారథి, ములుగు:
ములుగు జిల్లాలోని రుద్రేశ్వర స్వామి కొలువైన, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని రాష్ట్ర గిరిజన ,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో కలిసి ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధాన గేటు నుంచి కాలినడకన ఆలయానికి చేరుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత లకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.రుద్రేశ్వరుడిని దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.ఆలయ విశిష్టత, ప్రత్యేకతలను అక్కడి అధికారులు మంత్రికి, ఎమ్మెల్సీ కవిత కి వివరించారు.ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,ములుగు గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మరియు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.